cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా హీరో కోసమా సుకుమార్ వేట?

మెగా హీరో కోసమా సుకుమార్ వేట?

సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఇప్పటి  రెండు సినిమాలు నిర్మించి, తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ లను డైరక్టర్లను చేసాడు దర్శకుడు సుకుమార్. ఇప్పుడు మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి మైత్రీమూవీస్ తో జతకట్టారు ఇందుకోసం. అంతేకాదు, అచ్చమైన తెలుగు హీరోయిన్ కావాలంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చేసారు.

అయితే అసలు సంగతి ఏమిటంటే, ఈ అచ్చమైన తెలుగు హీరోయిన్, ఈ మైత్రీ మూవీస్ భాగస్వామ్యంతో చేసే సుకుమార్ రైటింగ్స్ సినిమాతో మరో మెగా హీరో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఆ కొత్త మెగాహీరో ఎవరో కాదు. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్.

వైష్ణవ్ తేజ్ హీరోగా రంగంలోకి దిగుతాడని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా సినిమా వుంటుందని అప్పట్లో వినిపించింది. అయితే లేటెస్ట్ గా సుకుమార్ తన బ్యానర్ లో, మైత్రీ సహకారంతో నిర్మించే సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతాడని వినిపిస్తోంది.

అందుకోసమే అచ్చమైన తెలుగుమ్మాయి అంటూ కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారట. ఈ సినిమాకు రైటర్ సానా బుచ్చిబాబు దర్శకుడుగా వ్యవహరిస్తారు.