మెగాస్టార్ చిరంజీవికి సాధారణంగా ఎవ్వరినీ దూరం పెట్టరు. అలాగే ఆయన బహిరంగంగా కోపం కనబర్చిన సందర్భాలు అరుదు. అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలో ఓ గ్యాసిప్ వినిపిస్తోంది.
ఓ దర్శకుడి మీద మెగాస్టార్ కాస్త కినుకతో వున్నారన్న గ్యాసిప్ చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం మరేమీ కాదని, ఆయన కొడుకు చరణ్ మీదనే ఆయన దగ్గర కాస్త కంప్లయింట్ మాదిరిగా మాట్లాడడమే అని ఆ గ్యాసిప్ ఎక్స్ టెన్షన్.
విషయం ఏమిటంటే, ఓ సినిమా ఫినిష్ కావాలంటే చరణ్ కోపరేషన్ అవసరం అని, కానీ ఆయన ఏమీ పట్టనట్లు వున్నారని, అందుకే ఓ మాట చెప్పమని ఆ డైరక్టర్ మెగాస్టార్ ను కోరినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. ఆ మాటకు అలాగే, తప్పకుండా అని అనేసారు కానీ అప్పటి నుంచి ఆ దర్శకుడి మీద కాస్త కినుక వహించారని టాక్ వినిపిస్తోంది.
తన కొడుకు మీద తనకే ఫిర్యాదు చేయడం ఏమిటి? అని మెగాస్టార్ ఫీలయినట్లు బోగట్టా. ఎంతవరకు నిజం వుందీ గ్యాసిప్ లో అన్న సంగతి మాత్రం తెలియదు కానీ, గ్యాసిప్ చలామణీ మాత్రం బాగానే అవుతోంది.