ఎవరి మంచి చెడ్డలకు వారు పూజలు, జపాలు, హొమాలు చేయించుకోవడం పెద్ద చిత్రమూ కాదు, తప్పిదమూ కాదు. అయితే ఇలాంటి వ్యవహారాలన్నీ ఇంటికో, ఓ గుడికో పరిమితం చేసుకుంటారు. వీలయినంత కామ్ గా జరిపించుకుంటారు. కానీ మెగాస్టార్ చిరు వ్యవహారం మాత్రం వేరుగా వుంది. 61వ పుట్టిన రోజు కొంచెం దూరంలో వుండగానే వివిధ ఆలయాల్లో పూజులు, హోమాలు షురూ అయ్యాయి. కుటుంబ సభ్యులు ఎవరి అవకాశం మేరకు వారు ఆలయాలకు వెళ్లి మరీ వీటిని జరిపిస్తున్నారు. చిరు సతీమణి ఏకంగా శ్రీకాకుళం జిల్లా దాకా వెళ్లి అక్కడి ఆలయాలు, ఆశ్రమాల్లో హోమాలు జరిపించుకు వచ్చారు.
నిజానికి ఇలాంటి హడావుడి 60వ పుట్టిన రోజుకు చేసారంటే, షష్టిపూర్తి కదా అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు ఇన్ని గుళ్లలో పూజులు హోమాలు చేయించాల్సి వచ్చింది. కేవలం 150 వ సినిమా కోసమే అని అనుకోవడానికి లేదు. సమ్ థింగ్ ఇంకేదో వుంది.. ఇదే అనుమానం టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తోంది.
బహుశా చిరు జాతకంలో గ్రహస్థితి లేదా దోషం ఏదయినా జస్ట్ టైమ్ బీయింగ్ కు ఏర్పడి వుంటుందని, దాని పరిహారం కోసమే ఇలాంటి రెమిడీని జ్యోతిష్కులు ఎవరైనా చెప్పి వుంటారని టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితిని చిరు ఫ్యామిలీ కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. లేదూ అంటే చిరంజీవి భార్య స్వయంగా కొన్ని గుళ్లకు వెళ్లడం, అక్కడ హోమాలు వంటివి ప్రారంభించి రావడం, ముగింపు వేళకు వస్తామని చెప్పడం అంటే అనేక ఆలోచనలకు దారి తీస్తోంది.
ఈ హొమాలు ఏమిటన్నది క్లియర్ గా వార్తలు రాలేదు కానీ, సూర్యుడికి సంబంధించిన హోమాలు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇవే హోమాలు జరిపిస్తున్నారా? మరింకేంటి అన్నది తెలియదు. ఇది కాక వివిధ ఆలయాల్లో పూజులు మామూలే.
ఇదంతా ఎందుకోసం అన్నదే, పవన్ కళ్యాణ్ పార్టీ జనాల్లోకి ఎప్పుడు వస్తుంది? ఇలాంటి ప్రశ్నలాంటిదే ఇదీనూ? అంత సులువుగా సమాధానం లభించదు.