మహేష్‌ న్యూ గెటప్‌.. అదెలా వుంటుందో.!

మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా రూపొందనున్న సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో మహేష్‌ కోసం వెరైటీ గెటప్‌ ప్లాన్‌ చేశాడట దర్శకుడు మురుగదాస్‌. ఈ గెటప్‌ కోసం బాలీవుడ్‌ నుంచి హెయిర్‌స్టయిలిస్ట్‌లను తీసుకొచ్చిన…

మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా రూపొందనున్న సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో మహేష్‌ కోసం వెరైటీ గెటప్‌ ప్లాన్‌ చేశాడట దర్శకుడు మురుగదాస్‌. ఈ గెటప్‌ కోసం బాలీవుడ్‌ నుంచి హెయిర్‌స్టయిలిస్ట్‌లను తీసుకొచ్చిన మురుగదాస్‌, నాలుగైదు గెటప్స్‌ వేయించి, వాటిల్లో ఒకదాన్ని ఫైనల్‌ చేశాడట. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

ఇక, ఈ సినిమాతో మురుగదాస్‌ సొసైటీకి మంచి మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నాడు. మురుగదాస్‌ సినిమాలన్నీ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. తెలుగులో మురుగదాస్‌ ఇప్పటిదాకా చేసింది ఒకే ఒక్క సినిమా. అదే 'స్టాలిన్‌'. ఆ తర్వాత తెలుగులో మళ్ళీ మురుగదాస్‌ సినిమా చేస్తున్నది మహేష్‌తోనే. 

ఇంకోపక్క, మహేష్‌ సరసన ఎవరు హీరోయిన్‌గా నటిస్తారు.? అన్నదానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. అధికారికంగా ఆమె పేరుని ప్రకటించాల్సి వుంది. మహేష్‌ విషయంలో మాత్రం కాస్త క్లారిటీ దొరికింది.. మహేష్‌ న్యూ గెటప్‌లో కన్పించబోతున్నాడని.

అదొక్కటే కాదు, ఈ సినిమా కోసం మహేష్‌ కాస్త కండలు తిరిగిన శరీరం ప్రదర్శించబోతున్నాడట. '1 నేనొక్కడినే' సినిమా కోసం మహేష్‌ కాస్త కష్టపడ్డాడు. ఆ సినిమా టైమ్‌లోనే మహేష్‌ సిక్స్‌ ప్యాక్‌ చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. ఈసారి సిక్స్‌ ప్యాక్‌ చేయడంలేదుగానీ, దాన్ని తలపించేలా కండలు తిరిగే శరీరం కోసం గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది.