వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో విషయం వున్న డైరక్టర్ గా పేరు సంపాదించుకున్న మేర్లపాక గాంధీ రెండో సినిమా ఎప్పుడు అనేదాని కన్నా ఎవరితో అన్నది ఆసక్తికరంగా వుంది. అదేంటీ? నితిన్ తో కన్ ఫర్మ్ అయిందట కదా అని అనేయచ్చు. ఇక్కడ విషయం అది కాదు.
ప్రస్తుతం గాంధీ దగ్గర ముగ్గురు నిర్మాతల అడ్వాన్సులు వున్నాయని వినికిడి. తొలి అవకాశం ఇచ్చిన జెమిని కిరణ్, బండ్ల గణేష్, మరో నిర్మాత అడ్వాన్సులు ఇచ్చారని వినికిడి. వీరి ముగ్గురికి కూడా తన రెండో సినిమా చేస్తానని గాంధీ మాట ఇచ్చాడట.
అలాంటపుడు నితన్ లైన్ విని, స్క్రిప్ట్ నచ్చి, ఓకె అంటే ఎవరికి చేస్తాడు అన్నది సమస్య. ఒకరికి చేస్తే మరొకరు ఒప్పుకోరు. ఇక్కడ ఇంకో ట్విస్టు కూడా వుంది. మేర్లపాకకు నితిన్ డేట్ లు ఇస్తే, అది హోం ప్రొడక్షన్ కావాలని సుధాకర రెడ్డి చూస్తున్నాడట. ఇవీ కృష్ణనగర్ తాజా డిస్కషన్