Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మిల్కీ బ్యూటీ భయపెట్టడం పక్కా.?

మిల్కీ బ్యూటీ తమన్నా 'దేవి' అనే సినిమాలో నటిస్తోంది. ముందు ఈ సినిమాకి 'అభినేత్రి' అనే టైటిల్‌ అనుకున్నారు. దాన్ని 'దేవి'గా మార్చారట. 'అభినేత్రి' టైటిల్‌తో ఫస్ట్‌ లుక్‌ కూడా వచ్చేసిన తర్వాత దాన్ని 'దేవి'గా ఎందుకు మార్చాలనుకుంటున్నారోగానీ, గతంలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవి' సినిమా అప్పట్లో పెద్ద విజయమే సాధించింది గనుక, బహుశా ఆ సెంటిమెంట్‌ ఈ సినిమాకీ వర్కవుట్‌ అవుతుందేమో.! 

ఇక, 'దేవి' సినిమా అసలు హర్రర్‌ సినిమానే కాదని మొదట్లో అటు మిల్కీ బ్యూటీ తమన్నా, ఇటు కొరియోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ ప్రభుదేవా చెబుతూ వచ్చారు. ఈ చిత్రంలో ప్రభుదేవా నటిస్తుండడమే కాదు, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఈ సినిమా ఒక ఎత్తు.. నటిగా తమన్నా విశ్వరూపమే చూపిస్తుందని చిత్ర యూనిట్‌ అంటోంది. 

ఇదిలా వుంటే, హర్రర్‌ సినిమాల జోనర్‌లో ఇదో ప్రత్యేకమైన చిత్రమవుతుందంటున్న ప్రభుదేవా, తమన్నా నటన న భూతో న భవిష్యతి అనేలా వుంటుందని చెబుతున్నాడు. సినిమాతో ఖచ్చితంగా భయపెడతాం.. తమన్నా లేకపోతే ఈ సినిమానే లేదు.. ప్రభుదేవా ఈ సినిమాలో నటించడం సినిమాకి అదనపు ఆకర్షణ అంటున్నాడు దర్శకుడు విజయ్‌. సెప్టెంబర్‌ 9న 'దేవి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్టు, ఈ సినిమాలో తమన్నా మేకప్‌ కోసం గంటన్నర టైమ్‌ తీసుకోవాల్సి వచ్చిందట. 

అచ్చం పల్లెటూరి అమ్మాయిలా ఎలాంటి మేకప్‌ లేని గెటప్‌ కోసం తమన్నా గంటన్నర టైమ్‌ తీసుకోవడమంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి. తమన్నా అందాన్ని తగ్గించే ప్రయత్నమా ఇది.? లేదంటే దయ్యం గెటప్‌ కోసం పట్టిన టైమా.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?