మితిమీరి అడ్వాన్స్ లు తీసుకుంటే ఇంతే

సినిమా రంగంలో అడ్వాన్స్ లు ఇవ్వడం అన్నది కామన్. ఒక విధంగా రుమాలు వేయడం అన్నమాట. సరైన సక్సెస్ వచ్చేవరకు అడ్వాన్స్ లు ఇచ్చినవారు సైలెంట్ గా వుంటారు. సక్సెస్ వచ్చాక, సినిమా చేయాల్సిందే…

సినిమా రంగంలో అడ్వాన్స్ లు ఇవ్వడం అన్నది కామన్. ఒక విధంగా రుమాలు వేయడం అన్నమాట. సరైన సక్సెస్ వచ్చేవరకు అడ్వాన్స్ లు ఇచ్చినవారు సైలెంట్ గా వుంటారు. సక్సెస్ వచ్చాక, సినిమా చేయాల్సిందే అంటారు. కొందరయితే ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కు వడ్డీతో ముక్కుపిండి వసూలు చేసేవారు వుంటారు. అందుకే ఇప్పుడు దర్శకులు తొందరపడి అడ్వాన్స్ లు తీసుకోవడం లేదు. నాని, బన్నీ లాంటి హీరోలు అయితే అసలు అడ్వాన్స్ లే ముట్టరు. అంతా అయ్యాక, సినిమా ఫినిష్ అవుతుంటే సింగిల్ పేమెంట్ తీసుకుంటారు.

కానీ డైరక్టర్ పరుశురామ్ సంగతి వేరు. ఆయన కాస్త జోరుగానే అడ్వాన్స్ లు తీసేసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ వుంది. ఇప్పటికిప్పుడు ఆయన దగ్గర దాదాపు అరడజను అడ్వాన్స్ లు వుండి వుంటాయని అంచనా. వీటిలో గీతా, ముంచు, భోగవిల్లి ప్రసాద్, మైత్రీమూవీస్ ఇలా లైన్ లో చాలా మందే వున్నారు.

భోగవిల్లి ప్రసాద్ తన అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయమని అడిగినా ఇప్పటివరకు ఇవ్వలేదని ఇండస్ట్రీలో గుసగుస వుంది. ఆయనది మెత్తని వ్యవహారం కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడేమయింది. తమకు సినిమా చేయమని మంచు మోహన్ బాబు అడుగుతున్నారు. అది సహజం. అడ్వాన్స్ తీసుకున్నాక చేయాలి కదా. తరువాత సినిమా తమకే అని గీతా అంటోంది. ఇద్దరి మధ్య ఇప్పుడు పరుశురామ్ నలగాలి. అది ఆయన స్వయంకృతం. ప్లాన్ లేకుండా అడ్వాన్స్ లు తీసుకున్న ఫలితం.