మొగుడు ఎలా వున్నాడో చెప్పలేదేం పూరీ?

సినిమా విడుదలకు ముందే శ్రీమంతుడుపై స్టేట్ మెంట్ పడేసాడు దర్శకుడు పూరి జగన్నాధ్. తరువాత అయితే గుంపులో గోవిందా అన్నట్లు వుంటుంది అనుకున్నాడో ఏమో? కానీ జనాలు వేరుగా అనుకున్నారు. మహేష్ తో తరువాతి…

సినిమా విడుదలకు ముందే శ్రీమంతుడుపై స్టేట్ మెంట్ పడేసాడు దర్శకుడు పూరి జగన్నాధ్. తరువాత అయితే గుంపులో గోవిందా అన్నట్లు వుంటుంది అనుకున్నాడో ఏమో? కానీ జనాలు వేరుగా అనుకున్నారు. మహేష్ తో తరువాతి సినిమా కోసం బిస్కట్ వేస్తున్నాడు అని చెవులు కొరుక్కున్నారు. శ్రీమంతుడు ఫలితం తేడావస్తే, మహేష్ మాస్ సినిమా చేయాలని అనుకుంటున్నాడని, అందుకే పూరి ముందుస్తు వ్యూహంతో ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడని అనుకున్నారు. 

కానీ ఇప్పుడు శ్రీమంతుడు పెద్ద హిట్ అయింది. రామ్ గోపాల్ వర్మతో సహా అందరూ ఎవరి స్టేట్ మెంట్ లు వారు ఇచ్చేసారు. కానీ పూరి ఏమీ మాట్లాడడం లేదు. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే నా మొగుడు అన్నారు..ఆ మొగుడి కోసం చూస్తున్నా అన్నాడు అప్పుడు. మరి ఇప్పుడు శ్రీమంతుడైన ఆ మొగుడు ఎలా వున్నాడో పూరి ఎందుకని చెప్పడం లేదో? కొంపదీసి శ్రీమంతుడు విజయం చూసి మైండ్ బ్లాంక్ అయిందా ఏమిటి?