మోహన్‌బాబు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుని ఎలాంటి విభిన్నమైన పాత్రలు చేసాడనేది ఎనభై, తొంభై దశకాల్లో తెలుగు సినిమాలు చూసిన వారికి తెలుసు. ఆయన తనయులు విష్ణు, మనోజ్ మాత్రం అలాంటి ఇమేజ్‌ని తెచ్చుకోలేకపోయారు. మోహన్‌బాబు మాదిరిగా విలన్ వేషాలు వేయడానికి వీళ్లు ఇంతదాకా ధైర్యం చేయలేదు.
కానీ తొలిసారిగా మనోజ్ నెగెటివ్ రోల్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ‘కరెంట్ తీగ’ తర్వాత మరో రెండు సినిమాలకి కమిట్ అయిన మనోజ్ వాటిలో ఒకదాంట్లో నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు చెప్పాడు. అయితే ఈ క్యారెక్టర్ పూర్తిగా విలన్ క్యారెక్టరా లేక నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టరా అనేది చెప్పలేదు. అయితే తన తండ్రిని ఫాలో అవుతూ మొదటి అడుగు వేస్తున్నాడు కనుక మెచ్చుకోవాల్సిందే.
ఇదిలావుంటే ఇంతవరకు తన కెరీర్లో పెద్ద హిట్ ఏదీ సాధించని మనోజ్ ‘కరెంట్ తీగ’ చిత్రంతో తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. మీడియం రేంజ్ హీరోగా ఎదగడానికి మనోజ్‌కి ఇదే గోల్డెన్ ఛాన్స్. అయితే ఈవారంలో కరెంట్ తీగకి పోటీగా మరిన్ని సినిమాలు వస్తున్నాయి. వాటిమధ్య తనకెంత పవర్ ఉందనేది చూపించాల్సి ఉంది.