కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లోని జనతా గ్యారేజ్ బజ్ ఏ రేంజ్ లో వుందో అందిరకీ తెలిసిందే. యూ ట్యూబ్ లో సినిమా టీజర్ దుమ్ము దులిపింది. ఈ సంగతి అలా వుంచితే ఈ సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కాసుల పంట పండించే అవకాశాలు ఫుష్కలంగా కనిపిస్తున్నాయట.
ఈ సినిమా రైట్స్ ను మలయాళానికి మోహన్ లాల్ నే తీసుకున్నారు. ఆయనకుఈ రైట్స్ కు సుమారు్ రెండున్నర కోట్లకు వచ్చాయట. ఇప్పుడు దీనికి బదులుగా ఒక్క మలయాళ శాటిలైట్ రైట్స్ నే మూడు నుంచి మూడున్నర కో్ట్లు వచ్చే అవకాశం వుంది. ఇది కాక థియేటర్ రైట్స్.
థియేటర్ రైట్స్ రూపంలో ఆరేడు కోట్లు వస్తాయని మోహన్ లాల్ అంచనా వేస్తున్నారని వినికిడి. అంటే రెండున్నర కోట్ల కు బదులుగా ఏడెనిమిది కోట్లు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మోహన్ లాల్ జనతా గ్యారేజ్ తో జాక్ పాట్ కొట్టేసినట్లే. మరోపక్క రజనీ కబాలి మలయాళ వెర్షన్ హక్కులు కూడా మోహన్ లాల్ నే తీసుకున్న సంగతి తెలిసిందే.