Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మోక్షజ్ఞ కోసం ‘ఆ నలుగురు’

మోక్షజ్ఞ కోసం ‘ఆ నలుగురు’

బాలయ్య కనిపించరు కానీ..ప్లానింగ్ లో భలేగా వుంటారు. కొడుకు మోక్షజ్ఞ విషయంలో ఆయన అయిడియాలు ఆయనకు వున్నాయని సన్నిహిత వర్గాల బోగట్టా. మాస్ మసాలా భారీ సినిమాలతో తన కొడుకును లాంచ్ చేయాలని బాలకృష్ణ అనుకోవడం లేదట. మంచి సినిమాలు కనీసం నాలుగు చేసిన తరువాత కావాలంటే, డిష్యుం.డిష్యుం సినిమాలు చేయొచ్చు అన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం ఆయన నలుగురు టాప్ డైరక్టర్ల పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నారట.

ఈ జాబితాలో రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, బోయపాటి పేర్లు వున్నట్లు తెలుస్తోంది. మరి వీరు చేస్తారా..చేయరా అన్నది తెలియదు కానీ, బాలకృష్ణ అయితే చేస్తే బాగుండును అనుకుంటున్నారట. రాజమౌళికి బాలకృష్ణ కుటుంబం అంటే అభిమానం. పైగా సాయి కొర్రపాటి ఆప్తుడు. అదీకాక  భారీ సినిమా చేసిన తరువాత ఆట విడుపుగా అయినా కొత్త హీరోతో కొత్తగా ఏదయినా ప్రయత్నించే అవకాశం వుంది. 

ఇక బోయపాటి అంటే బాలయ్య ఆస్థాన డైరక్టర్ కింద లెక్క. ఇక మిగిలింది త్రివిక్రమ్.. కొరటాల. వీరిలో కొరటాలను ఒప్పించడం కూడా పెద్ద కష్టం కాదు. ఎటొచ్చీ త్రివిక్రమ్ తోనే సమస్య. ఇంత వరకు ఎన్టీఆర్ తో కూడా తీయలేదు. మరి మోక్షజ్ఞ  అడిగితే సై అంటారా? అన్నదే అనుమానం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?