‘మనీ’తో ‘దొంగాట’?

చాన్నాళ్ల క్రితం వచ్చిన సినిమా 'మనీ'. చిన్న సినిమాగా వచ్చి, సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కూడా ఈ క్రైమ్ కామెడీ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు అన్నీ హిట్…

చాన్నాళ్ల క్రితం వచ్చిన సినిమా 'మనీ'. చిన్న సినిమాగా వచ్చి, సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కూడా ఈ క్రైమ్ కామెడీ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు అన్నీ హిట్ లే. ఐతే సినిమా కూడా ఇలాంటిదే. ఇప్పుడు దొంగాట అంటూ మరో సినిమా వస్తోంది. 

మంచు లక్ష్మి నిర్మాత, కీలక పాత్ర ధారిణి కూడా. ఈ సినిమా కు మనీకి కాస్త దగ్గర పోలికలున్నాయని ఇప్పుడు గుసగుస వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అడవి శేష్ కూడా ఇదే ముక్క చెబుతున్నాడు. మా సినిమాకు మనీ ఒక విధంగా స్ఫూర్తి అంటున్నాడట. అంటే ఒక విధంగా మనీ లేటెస్ట్ వెర్షన్ అనుకోవాలా?