సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుండడంతో మార్కెట్ ను పెంచుకునేందుకు హీరోలు ప్రయత్నిస్తున్నారు. తమిళ, మలయాళ భాషల్లోకి తన సినిమాలను పంపిస్తున్నారు. దాదాపు అందరి హీరోల ఆలోచనలు ఇలాగే వున్నాయి.
లేటెస్ట్ గా రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాను మూడు భాషల్లో విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యారు. గతంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను బాలీవుడ్ లో భారీగా విడుదల చేసాడు పవర స్టార్ పవన్ కళ్యాణ్. అయితే అది రాంగ్ ఎంట్రీ అయింది.
ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాతో తమిళ-మళయాల భాషల్లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే బన్నీ, ఎన్టీఆర్ సినిమాలు మళయాలంలోకి వెళ్తున్నాయి. మహేష్ ఈ ఏడాది తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బన్నీ వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఇప్పుడు పవన్ కూడా డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడు మూడు భాషలు, మూడు టైటిళ్ల కోసం కసరత్తు జరుతోంది. మూడు టైటిళ్లు ఫైనల్ అయ్యాకే ఫస్ట్ లుక్. సినిమాను ముందు చకచకా ఫినిష్ చేసే పనిలో వున్నారు త్రివిక్రమ్. అందువల్ల ఫస్ట్ లుక్ కు టైమ్ పట్టేలాగే వుంది.