పెళ్లయినంత మాత్రాన నెలల తరబడి ఎంజాయ్ చేస్తూ, సినిమాలకు డుమ్మా కొడతామనుకుంటున్నారా? అబ్బే ఆ ప్రసక్తే లేదు, పెళ్లయిన మూడు రోజులు కాగానే ఎంచక్కా, తాను, చైతూ ఇద్దరూ షూటింగ్ లకు వెళ్లిపోతాం అంటోంది హీరోయిన్ సమంత. హీరో నాగా చైతన్య హీరోయిన్ సమంతల పెళ్లి అక్టోబర్ లో గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ పెళ్లి కారణంగా వీరు ఇరువురు సినిమాకు కాస్త గ్యాప్ ఇస్తారని రూమర్లు పుట్టుకువచ్చాయి. దానికే ఇప్పుడు సమంత సమాధానం ఇచ్చింది. అంత సీన్ లేదని, పెళ్లయిన మూడు రోజుల తరువాత నుంచి షూటింగ్ లు షురూ అవుతాయని చెప్పుకొచ్చింది. సమంత ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమా చేస్తోంది. నాగ్ హీరోగా చేస్తున్న రాజుగారి గది 2 సినిమా దాదాపు పూర్తయింది.
నాగ్ చైతన్య చేస్తున్న యుద్ధం శరణం సినిమా దాదాపు పూర్తయింది. చందు మొండేటి-మైత్రీ మూవీస్ సినిమా ప్రారంభం కావాలి. ఆపైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా వుంది.