మొత్తం ఊడ్చేస్తున్నాయి

ఇప్పుడు టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా వుంది. ఏదో ఒక సపోర్టు వుంటే తప్ప, మార్కెట్ కావడం లేదు. అలా మార్కెట్ అయినా ఓపెనింగ్స్ వుండడం లేదు. సినిమాలో సమ్ థింగ్…

ఇప్పుడు టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా వుంది. ఏదో ఒక సపోర్టు వుంటే తప్ప, మార్కెట్ కావడం లేదు. అలా మార్కెట్ అయినా ఓపెనింగ్స్ వుండడం లేదు. సినిమాలో సమ్ థింగ్ వుండి, కాస్త నావెల్ గా పబ్లిసిటీ చేస్తే తప్ప, సినిమా గట్టెక్కడం లేదు. ఇక ఏ సపోర్టు లేకుండా, సినిమా తయారై విడుదలకు రెడీ అయితే మరీ సమస్యే. కిందా మీదా పడి విడుదల చేసుకుంటే, పైసా రాబడి లేకపోగా, థియేటర్ రెంట్లు కూడా రావడం లేదు. పెట్టుబడి మొత్తం ఊడ్చుకుపోతోంది.

ఈవారం విడుదలైన మనలో ఒకడు, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి లాంటి చిన్న సినిమాల పరిస్థితి ఇదే. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి సినిమా ఖర్చు కోటి కి బాగా దిగువనే కాబట్టి పెద్దగా చింతించనక్కరలేదు. కానీ మనలో ఒకడు సినిమాకు కాస్త రీజనబుల్ గానే ఖర్చు చేసారు. ఇంతో అంతో పబ్లిసిటీ చేసారు. కానీ పైసా రిటర్న్ రాలేదని తెలుస్తోంది.

 పైగా ఈ సినిమాను స్వంతంగా విడుదల చేసుకున్నారు. దాంతో పెట్టుబడి మొత్తం లాస్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఇక మిగిలిన ఆశ శాటిలైట్ ఒక్కటే, ఇటీవల చిన్న సినిమాల శాటిలైట్ మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే వుంది. ఇలా అయితే ఇక చిన్న సినిమాల భవిష్యత్ ఏమిటో?