ఒక్క డైలాగ్ తో గతాన్ని గుర్తుచేసిన అఖిల్

“ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా నా ఒక్కడి కోసమే పుట్టలేదు. వాళ్లకీ ఓ లైఫ్ ఉంటుంది. దాన్ని నేను గౌరవిస్తాను.” మిస్టర్ మజ్ను టీజర్ కు ఈ డైలాగ్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈ…

“ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా నా ఒక్కడి కోసమే పుట్టలేదు. వాళ్లకీ ఓ లైఫ్ ఉంటుంది. దాన్ని నేను గౌరవిస్తాను.” మిస్టర్ మజ్ను టీజర్ కు ఈ డైలాగ్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈ డైలాగ్ లోనే కథ మొత్తం దాగుందనేది దర్శకుడు వెంకీ అట్లూరి అభిప్రాయం. అది నిజంకావొచ్చు. కానీ ఇదే డైలాగ్ తో అఖిల్ గతాన్ని మరోసారి అందరికీ గుర్తుచేశాడు ఈ డైరక్టర్.

చిన్న వయసులోనే అఖిల్ కు పెళ్లి ఫిక్స్ అయింది. ఓ పెద్ద వ్యాపారవేత్త మనవరాలితో అఖిల్ ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ కళ్లముందే ఆ సంబంధం చెడిపోయింది. ఆ టైమ్ లో అక్కినేని కాంపౌండ్ మొత్తం సైలెంట్ అయింది. అఖిల్ కూడా అప్పట్లో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.

కట్ చేస్తే, అఖిల్ తో అప్పట్లో ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్న అమ్మాయి మరో పెళ్లి చేసుకుంది. ఇటు అఖిల్ కూడా అప్పటి చేదు జ్ఞాపకం నుంచి బయటపడి సినిమాలతో బిజీ అయ్యాడు. నాగచైతన్య-సమంత పెళ్లితో ఈ మేటర్ ను దాదాపు అంతా మరిచిపోయారు. అయితే మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఒక్క డైలాగ్ తో అప్పటి గతాన్ని మరోసారి అందరికీ  గుర్తుచేశాడు అఖిల్.

ప్రస్తుతం ఈ డైలాగ్ చుట్టూ సోషల్ మీడియాలో ఇదే చర్చ సాగుతోంది. గతంలో తన నుంచి విడిపోయిన అమ్మాయిని ఉద్దేశించి అఖిల్ ఈ డైలాగ్ పెట్టాడంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ డైలాగ్ ను కలకాలం గుర్తుపెట్టుకో అఖిల్ అంటూ మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. మిస్టర్ మజ్ను టీజర్ క్లిక్ అవ్వకపోయినా.. ఈ డైలాగ్ మాత్రం వైరల్ అవుతోంది. 

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు

వివాదాలు.. వైఫల్యాలు.. వివాహాలు..!