ప్రస్తుతం ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కూడా హడావుడి జరుగుతోంది ఎంతో కొంత అంటే అది కేవలం ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా వల్లే. ట్విట్టర్ లో రకరకాల స్టిల్స్ వదులుతూ ఆ ఎనీ టైమ్ థియేటర్ మూవీ మీద క్రేజ్ పెంచుతున్నారు ఆర్జీవీ. అయితే ఈ సినిమా ఎక్కడ విడుదలవుతుంది అన్నది ప్రశ్న.
శ్రేయాస్ ఇటి లో విడుదల అవ్వాలి లెక్క ప్రకారం. అలాగే ఆర్జీవీతో వున్న అగ్రిమెంట్ ప్రకారం. కానీ ఈ కాంట్రావర్సీ సినిమాను తన థియేటర్ లొ విడుదల చేసి, మెగా ఫ్యామిలీ ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేదు శ్రేయాస్ ఇటి కి. అందుకే ఆ సంస్థ వెనుకడగు వేస్తోంది.
ఆర్జీవీతో గతంలో ఐస్ క్రీమ్ సినిమా తీసిన రామసత్యనారాయణ కూడా ఓ ఏటిటి ను తన భీమవరం టాకీస్ బ్యానర్ మీద ఏర్పాటు చేసారు. ఇప్పటికే అందులో రెండు సినిమాలు విడుదల చేసారు. దాంట్లో పవర్ స్టార్ సినిమాను విడుదల చేసే అవకాశం కొంత వరకు వుంది.
కానీ సోషల్ మీడియాలో ఆర్జీవీ పవర్ స్టార్ సృష్టిస్తున్న ప్రకంపనలు చూసి, ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఛానెల్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రేటుచెబితే అవుట్ రేట్ గా తీసుకుంటామని, లేదా షేరింగ్ మీద ప్రదర్శించడానికి కూడా సిద్దమని తెలియచేసినట్లు తెలుస్తోంది. కానీ ఆర్జీవీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ ఫినిష్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే పనిలో వున్నారు.