టాలీవుడ్ కు సెంటిమెంట్లకు ముడి అని పదే పదే చెప్పనక్కరలేదు. ఇప్పుడు ఈ విషయాన్ని బలపర్చే మరో వార్త చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఎన్టీఆర్-సుక్కు కాంబినేషన్ లో రకుల్ కథానాయికగా బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు టైటిల్ అఫిషియల్ గా ప్రకటించలేదు.
కానీ నాన్నకు ప్రేమతో…అన్న వర్కింగ్ టైటిల్ మాత్రం వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ టైటల్ కు చిన్న మార్పుచేసారని వినికిడి. నాన్నకు ప్రేమతో అన్నదానికి బదులుగా..మా నాన్నకు ప్రేమతో…అని మార్చారని అంటున్నారు.
దీనికీ లాజిక్ వుందట..ఎన్టీఆర్ నా అక్షరం అచ్చిరాలేదని నాగ, నా అల్లుడు, నరసింహ అంత బాగా ఆడలేదని, అందుకే మా నాన్నకు ప్రేమతో అని మార్చారని అంటున్నారు. కానీ ఇంకా అసలు టైటిల్ ఇదేనా అన్నది మాత్రం అఫిషియల్ గా బయటకు రాలేదు.