నచ్చడం అంటే అదీ

మంచి నటుడు అంటే దర్శకులకు ఎప్పుడూ ఇష్టమే. ఒకసారి ఆ నటుడితో కనెక్ట్ అయిపోతే, ఇక వదలరు. సుబ్బరాజును పూరి జగన్నాధ్ అలాగే తన సినిమాల్లోకి తీసుకుంటూనే వుంటాడు. ఇష్క్ సినిమాతో టచ్ లోకి…

మంచి నటుడు అంటే దర్శకులకు ఎప్పుడూ ఇష్టమే. ఒకసారి ఆ నటుడితో కనెక్ట్ అయిపోతే, ఇక వదలరు. సుబ్బరాజును పూరి జగన్నాధ్ అలాగే తన సినిమాల్లోకి తీసుకుంటూనే వుంటాడు. ఇష్క్ సినిమాతో టచ్ లోకి వచ్చారు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్, దర్శకుడు విక్రమ్ కుమార్. ఆ సినిమాలో హీరో సమానమైన మాంచి రోల్ చేసాడు అజయ్. మంచి పేరు కూడా వచ్చింది.

ఆ తరువాత విక్రమ్ కుమార్ నేరుగా అజయ్ ను పెద్ద విలన్ ను చేసేసాడు 24 సినిమాలో. అంత పెద్ద ప్రాజెక్టులో కీలకమైన పాత్రను ఇచ్చాడు. అదే తమిళంలోకి అజయ్ తొలి ఎంట్రీ కూడా. ఇప్పుడు మళ్లీ మరో అవకాశం ఇచ్చాడు. అఖిల్ తో చేస్తున్న సినిమాలో మెయిన్ విలన్ గా.

ఇప్పటి దాకా అజయ్ ను మంచి నటుడిగా, విలన్ గా మనవాళ్లు కూడా బాగానే గుర్తించారు కానీ, విక్రమ్ కుమార్ ఇస్తున్న రేంజ్ కీలకమైన పాత్రలు అంతలా దొరకడం లేదు. ఇకపై అజయ్ మరింత బిజీ అవుతాడేమో?