రారండోయ్ వేడుక చూద్దాం. నాగా చైతన్య కెరీర్ లోనే కాస్త పెద్ద సినిమా. ఎక్కువ స్టార్ కాస్ట్. పైగా బెస్ట్ ఓపెనింగ్స్. అలాంటి సినిమాలో మరో లీడ్ ఏక్టర్ ను తీసుకోవడానికి నిర్మాత నాగార్జున నో అన్నాడా? ఈ మేరకు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలో హీరో హీరోయిన్లను పక్కన పెడితే, మూడు క్యారెక్టర్లు కీలకం. వాటిలో రెండు సంపత్, జగపతిబాబులను తీసుకున్నారు.
మూడో క్యారెక్టర్ కు న్యూ ఫేస్ ను తీసుకున్నారు. ఇలా న్యూ ఫేస్ ను తీసుకోవడం వల్ల కథలో కీలకమైన సమయంలో రావాల్సిన ఇంపాక్ట్ రాలేదు. సినిమా ప్రారంభంలో కనిపిసంచిన న్యూ ఫేస్ ను, మధ్యలో కీలకమైన సన్నివేశంలో గుర్తు పట్టడం జనాలకు కాస్త కష్టమే అయింది. అంతా బాగా చేసి, ఎందుకిలా చేసారు అని సినిమా జనాలు ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తే, కొత్త గుసగుస వినిపిస్తోంది.
డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ మరో నోటెడ్ ఫేస్ నే విలన్ గా తీసుకుందామని ప్రపోజ్ చేసాడట. అయితే ఇప్పటికే స్టార్ కాస్ట్ కు బడ్జెట్ ఎక్కువయింది. కొత్తవాళ్లను తీసుకోమని నాగ్ సూచించాడన్నది ఆ గుసగుసల సారాంశం. కానీ అలా కాకుండా సాఫ్ట్ ఫేస్ వున్న విలన్ ఏక్టర్ ను ఎవర్నయినా తీసుకుని వుంటే సినిమా ఇంకా బాగుండేది అని సినిమా జనాలు అభిప్రాయపడుతున్నారు. మరి నాగ్ ఎందకు అలా చేసినట్లో ?