నాగ్ చైతన్య ‘నాగేశ్వర రావు’

యంగ్ హీరోల్లో, తన లెవెల్ హీరోలతో పోల్చుకుంటే ఫుల్ బిజీగా వున్నాడు, ఫుల్ డిమాండ్ లో వున్నాడు నాగ్ చైతన్య. చేతిలో వరుసగా సినిమాలు. శేఖర్ కమ్ములతో సినిమా సెట్ మీద వుంది. స్వంత…

యంగ్ హీరోల్లో, తన లెవెల్ హీరోలతో పోల్చుకుంటే ఫుల్ బిజీగా వున్నాడు, ఫుల్ డిమాండ్ లో వున్నాడు నాగ్ చైతన్య. చేతిలో వరుసగా సినిమాలు. శేఖర్ కమ్ములతో సినిమా సెట్ మీద వుంది. స్వంత ప్రాజెక్టు బంగార్రాజు చేయాల్సి వుంది. మధ్యలో మరో సినిమా ఓకె చేసాడు. 14 రీల్స్ పతాకంపై పరుశురామ్ (బుజ్జి) డైరక్షన్ లో ఓ సినిమా చేయాలి. 

ఈ సినిమాకు స్క్రిప్ట్ వరకు దాదాపు పూర్తయినట్లు బోగట్టా. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సోలో, సారొచ్చారు, గీతగోవిందం ఇలా సబ్జెక్ట్ కు కాస్త అటు ఇటుగా వుండేలా వెరైటీ టైటిళ్లు పెట్టే పరుశురామ్ ఈ సారి చైతూ సినిమాకు 'నాగేశ్వర రావు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ టైటిల్ ను అక్కినేని ఫ్యామిలీ ముందు పెట్టారు. నాగ్, నాగ్ చైతన్య  ఓకె అనేస్తే అదే ఆ సినిమాకు టైటిల్ అవుతుంది. నాగ్ చైతన్యకు ఇది ఇరవయ్యవ సినిమా. వాల్మీకి సినిమాతో హిట్ లైన్ లోకి వచ్చిన 14 ప్లస్ పతాకంపై ఈసినిమా నిర్మిస్తారు.