త్వరలో ఓంకార్ డైరక్షన్ లో ఓ హర్రర్ కామెడీ సినిమా చేయబోతున్నాడు నాగార్జున. ఈ సినిమా మలయాళీ రీమేక్. ఆ కథ విన్న దగ్గర నుంచీ నాగ్ అదే కలవరించడం, దాన్నే మీడియా తెగ ప్రచారం చేయడం జరిగిపోయింది. అయితే ఈ మలయాళీ కథ ఎందుకు నాగ్ కు అంత నచ్చేసిందో? అన్న సంగతి పక్కన పెడితే..ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తున్న సంగతేమిటంటే, ఈ కథలో నాగ్ తో పాటు మరో మూడు కుర్రాళ్ల పాత్రలు కూడా కీలకం అని తెలుస్తోంది.
ఓ పాత్ర ఎలాగూ ఓంకార్ తమ్ముడు అశ్విన్ కు రిజర్వ్ చేసి వుంటుంది. మరో రెండు యంగ్ పాత్రలకు ఎవర్ని తీసుకుంటారో? రాజ్ తరుణ్, నాగశౌర్య లాంటి వాళ్లను తీసుకుంటే మల్టీస్టారర్ గా బాగానే వుంటుంది. కానీ, వాళ్ల దగ్గర అశ్విన్ తేలిపోతాడు. అందువల్ల బహుశా అశ్విన్ రేంజ్ జనాలనే తీసుకునే అవకాశం వుంది.
కానీ అలా చేసే కన్నా రాజ్ తరుణ్, నాగశౌర్య లాంటి వాళ్లు ముగ్గురిని తీసుకుంటేనే సినిమాకు ఓ రేంజ్ వుంటుంది. ఎందుకంటే అది నాగ్ సినిమా కదా? పైగా నాగ్ ది కీలక పాత్ర అయినా, చాలా వరకు సినిమా ఈ ముగ్గురు కుర్రాళ్ల మీదే వుంటుందని వినికిడి.