సినిమా హిట్ అయితే హీరోకి హ్యాపీనే. అందులో సందేహం లేదు. అయితే ఓం నమో వెంకటేశాయ రిజల్ట్ విషయంలో హీరో నాగార్జునకు హాపీ అందుకోసమం మాత్రమే కాదట. ప్రీమియర్ చూసిన వారు, థియేటర్లలో సినిమాను చూసిన వారు, నాగ్ నటనను తెగ మెచ్చేసుకుంటున్నారట. రామదాసు, అన్నమయ్య సినిమాలు కలెక్టివ్ వర్క్ తో క్లిక్ అయితే, ఓం నమో వెంకటేశాయ సినిమా మొత్తం నాగ్ చుట్టూనే తిరుగుతుంది.
క్లయిమాక్స్ లో నాగ్ నటనే సినిమాను నిలబెట్టింది. ఆ రెండు సినిమాలతో చూసుకుంటే, ఈ సినిమాలో నాగ్ 90శాతం భక్తిరసానికే అంకితం అయిపోయి నటించాడు. ఇవన్నీ కలిసి నాగ్ కు ప్రశంసలు కురిపించాయి. ఇప్పుడు ఇదే నాగ్ ఆనందానికి కారణమైందట. సినిమాలు హిట్ కావడం వేరు.
మనం, ఊపిరి, ఓం నమోవేంకటేశాయ వంటి సినిమాలు నటుడిగా నాగ్ పరిణితిని చూపించాయి. సీనియర్ నటుడు అనిపించుకుంటున్న వేళ ఇలాంటి ప్రశంసలు సహజంగానే ఉత్సాహాన్నిస్తాయి. నాగ్ ఇప్పుడు అదే జోష్ లో వున్నాడు.
ఓం నమో వేంకటేశాయ సినిమా 26 కోట్ల మీడియం బడ్జెట్ లో తెరకెక్కించారు. శాటిలైట్, నైజాం, ఓవర్ సీస్ కలిపి ఖర్చులు వచ్చేసాయి దాదాపుగా. మిగిలిన ఏరియాలు టేబుల్ ప్రాఫిట్ ఇచ్చాయి. ఇది కూడా నాగ్ కు హ్యాపీ న్యూసే కదా?