నాగ్..ఆ రెండు రోజులు..

హీరో నాగార్జున వైఖరే వేరు. చాలా బ్రాడ్ గా థింక్ చేస్తారు. హిట్, ఫ్లాప్ లకు పెద్దగా ఇదైపోడు..తన ఫ్లాప్ తానే ఒప్పకుంటాడు. కానీ ఓం నమో వెంకటేశాయ విషయంలో నాగ్ డిఫరెంట్ గా…

హీరో నాగార్జున వైఖరే వేరు. చాలా బ్రాడ్ గా థింక్ చేస్తారు. హిట్, ఫ్లాప్ లకు పెద్దగా ఇదైపోడు..తన ఫ్లాప్ తానే ఒప్పకుంటాడు. కానీ ఓం నమో వెంకటేశాయ విషయంలో నాగ్ డిఫరెంట్ గా బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున ఓం నమో వేంకటేశాయ విషయంలో చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

తను కూడా చాలా సిన్సియర్ గా పబ్లిసిటీ చేసాడు. ప్రీమియర్ షో వేసిన తరువాత వచ్చిన ప్రశంసలకు పిచ్చ హ్యాపీగా ఫీలై నలుగురితో సరదాగా షేర్ చేసుకున్నాడు. అందరూ ఆ సినిమా క్లయిమాక్స్ సీన్ లో అద్భుతంగా నటించారని, ఇన్నాళ్ల అనుభవం, ఆ మెచ్యూరిటీ కనిపించిందని అంటుంటే పొంగిపోయాడు. 

కానీ తీరా చేసి, కమర్షియల్ గా సినిమా డిజాస్టర్ అయిందని, ఓపెనింగ్స్ ఘోరంగా వున్నాయని తెలిసిన తరువాత మాత్రం నాగ్ చాలా ఫీలయ్యాడని వినికిడి. ఏ మేరకు ఫీలయ్యాడు అంటే రెండు రోజుల పాటు ఎవ్వరితోనూ మాట్లాడలేదట. తనకు తానే అలా రెండు రోజుల పాటు ఎవ్వరి ఫోన్ లు లిఫ్ట్ చేయకుండా, ఎవ్వరితో కలవకుండా ఇంట్లో వుండిపోయినట్లు తెలుస్తోంది. ఆ తరువాతనే మళ్లీ సెట్ అయి రెగ్యులర్ వ్యవహారాల్లోకి వచ్చాడట.

ఓం నమో వెంకటేశాయ సినిమా విషయంలో నాగ్ చాలా నమ్మకం పెట్టుకోవడం, ప్రీమియర్ అనంతరం నాగ్ భార్య అమల ఆయన చేతిని అరగంట సేపు పట్టుకుని అలా వుండిపోవడం, ప్రతి ఒక్కరు అభినందించడం, ఆ వెంటనే సినిమా కమర్షియల్ గా క్లిక్ కాలేదని తెలియడం వల్ల నాగ్ బాగా అప్ సెట్ అయినట్లుంది మరి.