Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగార్జున అనుకుంటే సాధించేస్తాడంతే.!

నాగార్జున అనుకుంటే సాధించేస్తాడంతే.!

తెలుగు తెరపై ప్రయోగాలు చేయడంలో నాగార్జున అందరికన్నా ముందే వుంటారు. 'ఊపిరి' అనే సినిమా నాగార్జున నుంచి వచ్చిందంటే అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. పూర్తిగా వీల్‌ ఛెయిర్‌కే పరిమితమయిపోయే పాత్రలో ఓ స్టార్‌ హీరో, అందునా రొమాంటిక్‌ హీరో నటించడం అంటే, చాలా చాలా గొప్ప విషయమే. నటించడమే కాదు, నటించి మెప్పించాడు నాగార్జున 'ఊపిరి' సినిమాలో. 

ఇక, నాగార్జున తాజాగా తన మనసులో కోరికను బయటపెట్టాడు. అదే నెగెటివ్‌ రోల్‌లో కనిపించడం గురించి. తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ వద్ద తన కోరికను బయటపెట్టిన నాగార్జున, గౌతమ్‌ మీనన్‌ నుంచి మాత్రం సానుకూల స్పందన రాబట్టలేకపోయాడు. అయితేనేం, నాగార్జున.. నెగెటివ్‌ రోల్‌లో కనిపించి తీరతానంటున్నాడట. నెగెటివ్‌ రోల్‌లో కనిపించడానికి తాను సిద్ధమనీ, మంచి కథ వుంటే చూడాలనీ.. నాగార్జున, 'ఊపిరి' డైరెక్టర్‌ వంశీ పైడిపల్లికి చెప్పినట్లు తెలుస్తోంది. 

మరోపక్క, నాగార్జున ఇప్పటికే తన మనసులోని కోరికను 'మనం' డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ ముందుంచాడట కూడా. '24' సినిమాలో సూర్యని నెగెటివ్‌ రోల్‌లో, పాజిటివ్‌ రోల్‌లో చూపించిన విక్రమ్‌ కుమార్‌, నాగార్జున కోసం అలాంటిదే మరో సబ్జెక్ట్‌ రెడీ చేశాడనే ప్రచారం జరుగుతోంది. నాగార్జున అనుకుంటే అయిపోద్దంతే. ఎందుకంటే, నాగార్జున నటుడే కాదు, అభిరుచిగల నిర్మాత కూడా. వంశీ పైడిపల్లి.. లేదంటే విక్రమ్‌ కుమార్‌.. ఈ ఇద్దరిలో ఎవరు ముందు నాగ్‌ని మెప్పించగలిగితే, వారితో నాగ్‌, సినిమా చేసే అవకాశముంది. అందులో నాగ్‌ని నెగెటివ్‌ రోల్‌లో ఖచ్చితంగా చూసెయ్యొచ్చు. గెట్‌ రెడీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?