Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాలుగు కోట్లు అడిగితే ఎలా అమ్మడూ?

నాలుగు కోట్లు అడిగితే ఎలా అమ్మడూ?

హీరోయిన్ అన్న తరువాత డిమాండ్ పెరుగుతూ వుంటుంది. ఎప్పుడో మనం పరిచయం చేసిన హీరోయిన్, మనం లిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ అలాగే అక్కడే వుండిపోదు. డిమాండ్ పెరుగుతుంది. రెమ్యూనిరేషన్ పెరుగుతుంది. ఇక్కడ మొహమాటాలు వుండవు.

సినిమా.. రెమ్యూనిరేషన్ రెండే వుంటాయి. కానీ ఇది పరిగణనలోకి తీసుకోక ఓ దర్శకుడు మాత్రం కాస్త అసహనంగా ఫీలవుతున్నారని తెలుస్తోంది.

ఆయన ఓ సీనియర్ దర్శకుడు. ఓ బుట్టబొమ్మలాంటి హీరొయిన్ ను కాస్త బాగానే ఎంకరేజ్ చేసారు. ఆ అమ్మాయి కూడా బాగానే సినిమా సినిమాకు స్థాయి పెంచుకుంటూ మంచి పొజిషన్ కు చేరుకుంది. కొత్త నీరు వచ్చినా చేతిలో ఒకటో రెండో సినిమాలు వున్నాయి కానీ ఖాళీగా అయితే లేదు.

ఇలాంటి టైమ్ లో ఓ సీనియర్ హీరో పక్కన తన సినిమాలో చేయమని, అప్పట్లో వరుసగా రెండు సినిమాలు ఇచ్చిన దర్శకుడు అడిగారట. నాలుగు కోట్లు రెమ్యూనిరేషన్ కోట్ చేసారట సదరు హీరోయిన్. రెండు కోట్లకు చేయవచ్చు కదా అంటే సినిమా సినిమానే, గౌరవం.. అభిమానం వాటి దారి వాటిదే అనే టైప్ సమాధానం వచ్చేసరికి, మరి మాట్లాడలేక మరో కొత్త హీరోయిన్ పరిచయం చేస్తా అని పంతంగా వెదుకుతున్నారట సదరు దర్శకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?