నమ్రత పాత్రలో ఉపాసన

ఈ జనరేషన్ అమ్మాయిలకు చాలా టాలెంట్ వుంది. వ్యవహారాలు చురుగ్గా చక్కబెట్టగలరు. అందునా సెలబ్రిటీల వైఫ్ లు అయితే మరీనూ. హీరో మహేష్ బాబు భార్య నమ్రత ఈ విషయంలో ముందే ప్రూవ్ చేసుకున్నారు.…

ఈ జనరేషన్ అమ్మాయిలకు చాలా టాలెంట్ వుంది. వ్యవహారాలు చురుగ్గా చక్కబెట్టగలరు. అందునా సెలబ్రిటీల వైఫ్ లు అయితే మరీనూ. హీరో మహేష్ బాబు భార్య నమ్రత ఈ విషయంలో ముందే ప్రూవ్ చేసుకున్నారు. మహేష్ అభిరుచికి తగినట్లు ఇల్లు కట్టించడంలో, శ్రీమంతుడు సినిమా పబ్లిసిటీలో, ఇప్పుడు బ్రహ్మోత్సవం వ్యవహారాల్లో ఆమె హ్యాండ్ పూర్తిగా వున్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు మరో హీరో భార్య కూడా అదే స్టయిల్ ను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఎవరో కాదు.. రామ్ చరణ్ భార్య ఉపాసన. నిజానికి ఉపాసన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు.. తల్లి, తండ్రి ఇద్దరి వైపు మెగా మెడికల్ బ్యాక్ గ్రవుండ్ వుంది. అందువల్ల ఆమెకు మంచి మేనేజ్ మెంట్ స్కిల్స్ వున్నాయి. ఆమె ఇప్పుడు రామ్ చరణ్ పర్సనల్ వ్యవహారాలు చూసుకుంటున్నారట. 

అందుకు ఎక్కడిక్కడ స్టాఫ్ వున్నారు. అయినా వారికి పనులు చెప్పడం, వారి ద్వారా పనులు చేయించడం వంటివి ఉపాసన టేకప్ చేసినట్లు వినికిడి. ముఖ్యంగా చరణ్ కు సంబంధించి ప్రెస్ వ్యవహారాలను ఇప్పుడు ఉపాసనే చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వున్న చరణ్ పీఆర్వోను మార్చింది కూడా ఉపాసన అని టాక్.

రామ్ చరణ్ ఈ పుట్టిన రోజు వేడుకలు, బ్లడ్ డొనేషన్ వ్యవహారాలు అన్నీ ఉపాసనే సూపర్ వైజ్ చేస్తున్నారట.ఆ మధ్య చిరు 60 వ బర్త్ డే పార్టీని ఉపాసనే ఆర్గనైజ్ చేసి మంచి మార్కులుకొట్టేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద మేడమ్ లు బాగానే రాణిస్తూ, హీరోలకు అండగా వుంటున్నారు.