నందమూరి హీరోలకు ఏమయింది?

విజయం ఇచ్చే ఊపు, ఉత్సాహానికి అవధులు వుండవు. అదే సమయంలో అనుకోని పరాజయం పలకరిస్తే, వచ్చే షాక్ మామూలుగా వుండదు. దాని నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. నందమూరి కుటుంబం అచ్చంగా ఇలాంటి…

విజయం ఇచ్చే ఊపు, ఉత్సాహానికి అవధులు వుండవు. అదే సమయంలో అనుకోని పరాజయం పలకరిస్తే, వచ్చే షాక్ మామూలుగా వుండదు. దాని నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. నందమూరి కుటుంబం అచ్చంగా ఇలాంటి స్థితిలోనే వున్నట్లు కనిపిస్తోంది.

నందమూరి బాలకృష్ణ కలలో కూడా ఊహించలేదు. తాను తన తండ్రి జీవితకథ ఆధారంగా తీసిన సినిమా ఇంత దారుణ పరాజయం పొందుతుందని. సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలకు ముందు ఆ సినిమాకు వున్న బజ్ ఇంతా అంతా కాదు. దానిని కొనడానికి బయ్యర్లు ఎగడబడిన వైనం కూడా ఇంతా అంతా కాదు.

అయితే ఫస్ట్ పార్ట్ మంచి ప్రశంసలు అందుకుంది. డబ్బులు మాత్రంరాలేదు. కానీ పేరు వచ్చింది కాబట్టి కాస్త ఊరట కలిగింది. రెండోభాగం మహానాయకుడు మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ భాగం మరీ దారుణంగా డిజాస్టర్ అయింది. కలెక్షన్లు చూస్తుంటే ఇంత దారణమా? జనాలు ఓ సినిమాను ఇంత దారుణంగా తిరస్కరిస్తారా? సినిమా విడుదలయిన ఆదివారంనాడు, హైదరాబాద్ లో షోకి ఏనిమిది వేలు కలెక్షన్ నా?

ఇప్పుడు ఇదే నందమూరి బాలకృష్ణను షాక్ కు గురిచేసినట్లు తెలుస్తోంది. ఆయన కెరీర్ లో డిజాస్టర్లు లేకపోలేదు. కానీ ఇది ఆయన నిర్మాతగా తొలి చిత్రం. ఆయన భార్యను నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిత్రం. అలాంటి సినిమా ఇలా అయిపోవడం అంటే బాలయ్య తట్టుకోలేపోతున్నట్లు కనిపిస్తోంది.

నిన్న జరిగిన 118 ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన నందమూరి హీరోలు, సినిమా సభకు వచ్చినట్లు లేరు. ఏదో సంతాప సభకు వచ్చినట్లు కనిపించారు. ముగ్గురు మొహాలు వీర సీరియస్ గా వున్నాయి. బాలయ్య స్పీచ్ అస్సలు ఇంత నిస్సారంగా, ఇంత చప్పగా గతంలో ఎన్నడూ లేదు. దానికి తగినట్లే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సీరియస్ గా మొహాలు పెట్టుకుని వుండిపోయారు. అలాగే మాట్లాడారు.

ఎవ్వరి మాటల్లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన పొరపాటున కూడా లేదు. కళ్యాణ్ రామ్, బాలయ్య బయోపిక్ లో నటించారు. వాళ్లు గత కొంతకాలంగా సినిమా గురించి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు. ఆయన మాట్లాడానికి ఇదే అవకాశం. ఆయన కూడా ఆఫ్ ది స్క్రీన్ లో కూడా వీరలెవెల్లో నటించేసారు. చాలా సీరియస్ గా, మొహం దించుకుని, నాలుగు ముక్కలు మాట్లాడేసి ఊరుకున్నారు.

కోడిరామకృష్ణ, బోర్డర్ లో సైనికులు చనిపోయినందుకు ఓ నిమిషం సంతాపం పాటిద్దాం అన్నారు. కానీ ఫంక్షన్ ఆద్యంతం బయోపిక్ ఫెయిల్యూర్ కు సంతాపం అన్నట్లు సాగింది.

118 ప్రీరిలీజ్ ఈవెంట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

జనసేనలో ఇప్పుడేం జరుగుతోంది?