Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

నందమూరి సపరివార సమేతంగా!

నందమూరి సపరివార సమేతంగా!

అక్కినేని హీరోలందరూ కలిసి ‘మనం’ సినిమా చేసినట్టుగా... నందమూరి హీరోలందరూ కలిసి ఒక చిత్రం చేస్తే బాగుంటుందని కళ్యాణ్‌రామ్‌కి కూడా ఉందట. అలాంటి స్క్రిప్ట్‌ దొరికితే... తమ అందరికీ సరిపడా పాత్రలు కుదిరితే తప్పకుండా చేస్తామని, ఆ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై తానే నిర్మించడానికి సిద్ధమని కళ్యాణ్‌రామ్‌ చెప్పాడు. 

‘పటాస్‌’ చిత్రానికి ముందు నందమూరి అభిమానులు కళ్యాణ్‌రామ్‌ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ‘అతనొక్కడే’ తర్వాత అతను హీరోగా నిలదొక్కుకుంటాడని అనుకుంటే వరుస ఫ్లాప్స్‌తో ఫాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసాడు. కానీ పటాస్‌తో మళ్లీ కళ్యాణ్‌రామ్‌ని నందమూరి ఫాన్స్‌ గుర్తించారు. టెంపర్‌ ఆడియో ఫంక్షన్‌లో కళ్యాణ్‌రామ్‌కి ఫాన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

పటాస్‌ ఇచ్చిన ఉత్సాహంతో ఇకపై మరిన్ని అలాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ చేయాలని అతను ఉత్సాహపడుతున్నాడు. అలాగే నిర్మాతగా కూడా పెద్ద చిత్రాలు ప్లాన్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో త్వరలోనే ఓ చిత్రం నిర్మించనున్న కళ్యాణ్‌రామ్‌ తన బాబాయ్‌ బాలకృష్ణ కోసం కూడా కథలు అన్వేషిస్తున్నాడు. కుదిరితే నందమూరి హీరోలందరం కలిసి ఒక సినిమా చేస్తామని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇది కానీ నిజమైతే నందమూరి అభిమానులకి పండగే కదూ!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?