నందమూరి కళ్యాణ్‌రామ్ ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓం 3డి చిత్రం మిగిల్చిన నష్టాలని భర్తీ చేసుకునేందుకు అతనో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం తనకి ఉన్న ట్రాక్ రికార్డ్‌తో క్రేజీ సినిమా చేయడం కష్టం కాబట్టి రవితేజతో సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.
ఇది ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ ఫ్యామిలీలో ఎన్టీఆర్, బాలకృష్ణలాంటి హీరోలు ఉండగా వారిని కాదని రవితేజతో సినిమా చేయడమేంటని అంటున్నారు. అయితే తమ ఫ్యామిలీ హీరోల మధ్య సంబంధాలు సరి లేవనే సంగతి ఈమధ్య ఓం ఆడియో రిలీజ్‌లోనే తేటతెల్లమయింది. కళ్యాణ్‌రామ్ ఆ విషయం ప్రస్తావిస్తూ కంటతడి పెట్టుకున్నాడు కూడా.
ఇలాంటి సమయంలో వారిని ఒప్పించి సినిమా చేయడం కుదరదని రవితేజతో చేయాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు. కిక్ సినిమా సీక్వెల్‌గా రవితేజ, సురేందర్ చేసే ఈ చిత్రం ఓ విధంగా మంచి ఛాయిస్ అని చెప్పాలి. కళ్యాణ్‌రామ్‌కి తన సినిమాని మార్కెట్ చేసుకోవడానికి, విడుదలకి ముందే సేఫ్ అవడానికి, అలాగే అన్నీ కలిసొస్తే పెద్ద హిట్ సొంతం చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ. ఇంకా ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు కానీ అందరి వైపు నుంచి మాటలు అయితే అయిపోయాయట.