కృష్ణార్జున యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చిన నాని వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్టు ను ఫిక్స్ చేశాడు. ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న అవసరాల శ్రీనివాస్ సినిమాకు ఓకే చెప్పాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే తన ఫ్రెండ్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాని సినిమా ఉంటుంది.
ప్రస్తుతం నాని వద్ద చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. హను రాఘవపూడితో చేయాల్సిన ప్రాజెక్టు ఎప్పట్నుంచో పెండింగ్. అది ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కూడా లేదు. మరోవైపు నానితో సీటీమార్ సినిమా చేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ ప్రయత్నిస్తున్నాడు.
ఈ రెండు సినిమాలపై చర్చలు నడుస్తున్న టైమ్ లోనే.. అవసరాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని. ఉన్నఫలంగా అవసరాలకు నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఓ బలమైన కారణం కనిపిస్తోంది.
తనను సంప్రదించిన హరీష్ శంకర్ తో సినిమా చేయడం ఇష్టంలేక.. అలా అని మొహంమీద నో చెప్పలేక.. ఇలా సడెన్ గా అవసరాల శ్రీనివాస్ ప్రాజెక్టును నాని తెరపైకి తీసుకొచ్చాడనే వాదన వినిపిస్తోంది.
నాని ఓకే చెప్పినప్పటికీ అవసరాల శ్రీనివాస్ సినిమా అప్పుడే సెట్స్ పైకి రాదు. ఎందుకంటే అంతకంటే ముందు శ్రీరామ్ ఆదిత్యతో చేయాల్సిన సినిమా లైన్లో ఉంది.
నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రానుంది. ఈరోజే ఆ సినిమా ఓపెనింగ్ కూడా ఉంది. సో.. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే అవసరాల శ్రీనివాస్ తో మూవీ ఉండొచ్చు.