నాని ఇంట్రెస్టింగ్ టైటిల్

నిన్ను కోరి సినిమా సక్సెస్ తో జోరు మీద వున్న హీరో నాని తన రెండు ప్రాజెక్టులను ప్రకటించాడు. వీటిలో ఒకటి తెలిసిందే. దిల్ రాజు-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లోని ఎం.సి.ఎ. అందువల్ల పెద్దగా…

నిన్ను కోరి సినిమా సక్సెస్ తో జోరు మీద వున్న హీరో నాని తన రెండు ప్రాజెక్టులను ప్రకటించాడు. వీటిలో ఒకటి తెలిసిందే. దిల్ రాజు-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లోని ఎం.సి.ఎ. అందువల్ల పెద్దగా ఆసక్తి లేదు.

కానీ ఆ రెండో సినిమాలో రెండు విషయాల ఆసక్తికరంగా వున్నాయి. ఒకటి టైటిల్. కృష్ణార్జునయుద్ధం అంట. భలేగా వుంది కదా? పైగా ఇందులో నాని డబుల్ రోల్ అంట. ఎందుకంటే నాని అండ్ నాని ఇన్ అంటూ ఈ టైటల్ ప్రకటించారు.

వరుసగా రెండు హిట్ లు కొట్టిన మేర్లపాక మురళి ఈ సినిమాకు డైరక్టర్. దీనికి తోడు విడుదల చేసిన టైటిల్ లోగో కూడా ఆసక్తి కరంగా వుంది. ఒక పక్క ఇండియా, మరో పక్క ఇటలీ ప్రతిబింబించేలా లోగో తయారుచేసారు. డబుల్ రోల్, రెండు దేశాల నేపథ్యం, పైగా కృష్ణార్జునల యుద్ధం అంటే కచ్చితంగా ఆసక్తికరమే.

నాని స్క్రిప్ట్ దగ్గరే సగం సక్సెస్ ను వెదుక్కుంటున్నాడు. లక్కీగా అతగాడికి అలాంటి స్క్రిప్ట్ లు వస్తున్నాయి. అందుకే మిస్టర్ డిఫెండబుల్ అన్న టైటిల్ ను టాలీవుడ్ లో స్వంతం చేసుకున్నాడు.