యువ కథానాయకుడు నానికి స్పల్పంగా గాయపడ్డాడని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో 'భలేభలే మగాడివోయ్' చిత్రంలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా అయిపోయింది. కేవలం రెండు పాటలు మాత్రమే బకాయి. ఓ పాట షూట్ చేస్తుండగా నాని కాలు కాస్త బెణికిందని సమాచారం.
Advertisement
వైద్యులు పరీక్షించి ఓ 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఆ కారణంతోనే. 'బాహుబలి' ఆడియోలో వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాల్ని చేజార్చుకొన్నాడు నాని. సినిమాకు తొందర ఎలాగూ లేదు. ఎందుకంటే బాహబలి రిలీజ్ చూసి కానీ భలే భలే మగాడివోయ్ థియేటర్లలోకి రాదు.