హ్యాట్రిక్ కోసం హిట్ హీరోను నమ్ముకున్నాడు

మేర్లపాక గాంధీ… పేరు కాస్త ఓల్డ్ గా ఉన్నప్పటికీ కుర్రాడు మాత్రం యంగ్. ఇండస్ట్రీకి వస్తూనే హిట్ కొట్టాడు. సెకెండ్ మూవీ ఫ్లాప్ అనే సిండ్రోమ్ ను దాటి రెండో సినిమాతో కూడా సక్సెస్…

మేర్లపాక గాంధీ… పేరు కాస్త ఓల్డ్ గా ఉన్నప్పటికీ కుర్రాడు మాత్రం యంగ్. ఇండస్ట్రీకి వస్తూనే హిట్ కొట్టాడు. సెకెండ్ మూవీ ఫ్లాప్ అనే సిండ్రోమ్ ను దాటి రెండో సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నాడు.

ఇప్పుడు ముచ్చటగా మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్న నానిని లైన్లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నాడు. 

ఇప్పటికే నానికి ఓ స్టోరీలైన్ వినిపించాడట గాంధీ. ఆ కథ నానికి కూడా బాగా నచ్చినట్టు టాక్. కథ ఓకే అయితే ప్రొడ్యూసర్ తో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం నాని దగ్గర ఇద్దరు నిర్మాతలు రెడీగా ఉన్నారు.                

హీరోయిన్, నిర్మాత ఎవరనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో హిట్స్ కొట్టిన గాంధీ, నానితో చేయబోయే మూడో సినిమాకు కూడా ఎక్స్ ప్రెస్ అనే పదం వచ్చేలా టైటిల్ పెడతాడేమో చూడాలి.

ప్రస్తుతం “నిన్నుకోరి” అనే సినిమా చేస్తున్నాడు నాని. వచ్చేనెల 7న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ మూవీ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఎంసీఎ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఎంసీఎ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయిన తర్వాతే గాంధీ ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది. అప్పటివరకు గాంధీకి వెయిటింగ్ తప్పదు.