Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎక్కువ ఆలోచిస్తే మొహం పగిలిపోతుంది

ఎక్కువ ఆలోచిస్తే మొహం పగిలిపోతుంది

దేవదాస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాను పిలిచిన నాని, ఎక్కువగా తన అప్ కమింగ్ మూవీ జెర్సీ గురించే మాట్లాడాడు. తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా జెర్సీ నిలిచిపోతుందంటున్నాడు. ఈ సినిమా కోసం గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నానని, కొన్నాళ్ల తర్వాత కొత్త నానిని చూస్తారని అంటున్నాడు.

"రోజుకు మూడున్నర గంటల పాటు బూత్ బంగ్లాలో క్రికెట్ ప్రాక్టీస్.. చెమట్లు కారిపోతున్నాయి. కొన్ని రోజుల తర్వాత కచ్చితంగా కొత్త నానిని చూస్తారు. విజయదశమికి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. నా కెరీర్ లోనే ప్రతిష్టాత్మక సినిమా ఇది. సినిమాలో నేను బౌలర్ కాదు. బ్యాట్స్ మన్ గానే కనిపిస్తాను."

తనకు క్రికెట్ పెద్దగా టచ్ లేదంటున్నాడు నాని. చిన్నప్పుడు పదోతరగతి వరకే క్రికెట్ ఆడాడట. ఆ తర్వాత పూర్తిస్థాయిలో క్రికెట్ ఆడలేదని, ఇప్పుడు జెర్సీ కోసం మరోసారి బ్యాట్ పట్టుకోవాల్సి వచ్చిందంటున్నాడు. ప్రొఫెషనల్ క్రికెటర్ దగ్గర కూడా లేనంత క్రికెట్ ఎక్విప్ మెంట్ తన ఇంట్లో ఉందంటున్నాడు నాని.

"పదో తరగతి వరకు క్రికెట్ ఆడాను. ఆ తర్వాత పూర్తిగా కట్ అయిపోయింది. సినిమా వాళ్లు ఆడిన మ్యాచుల్లో నన్ను చూస్తే ఏదో పెద్ద క్రికెటర్ అనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో పూర్తిస్థాయి క్రికెటర్ గా కనిపిస్తాను. నా చిన్నప్పుడు కూడా ఇంత ప్రాక్టీస్ చేయలేదు." జెర్సీ సినిమాలో ఇప్పటివరకు చూడని సరికొత్త నానిని చూస్తారంటున్నాడు ఈ హీరో.

లుక్, స్టయిల్ అన్నీ మారిపోతాయంటున్నాడు. "స్టయిల్, స్టాండింగ్, రిథమ్, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్... ఇలా ప్రతిది మారిపోతుంది. జెర్సీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత టాలీవుడ్ క్రికెట్ మ్యాచుల్లో ఆడితే, నేనే బెస్ట్ ప్లేయర్ అవుతాను. ఫాస్ట్ గా బాల్ వస్తున్నప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటుందా అని ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే మొహం పగిలిపోతుంది. ఏవీ ఆలోచించకుండా కేవలం క్రికెట్ మీద ఫోకస్ పెట్టాలి. ప్రస్తుతం అదే చేస్తున్నాను."

మూడున్నర నెలల నుంచి రెస్ట్ లేకుండా పనిచేస్తున్న నాని, మరో 3 రోజుల్లో ఫ్రీ అయిపోతానని అంటున్నాడు. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి ఏ కాశీకో వెళ్లి ప్రశాంతంగా కొన్నాళ్లు గడుపుతానని తెలిపాడు.

నాని ఇంటర్వ్యూ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?