నాని యాంటీ సెంటిమెంట్ కథ?

నిను కోరి. మాంచి క్లాసీ రొమాంటిక్ టైటిల్ తో వస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. కానీ ఈ సినిమా కథ మాత్రం కాస్త డిఫరెంట్ గా వుంటుందని తెలుస్తోంది. ఓ హిందీ సినిమా లైన్…

నిను కోరి. మాంచి క్లాసీ రొమాంటిక్ టైటిల్ తో వస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. కానీ ఈ సినిమా కథ మాత్రం కాస్త డిఫరెంట్ గా వుంటుందని తెలుస్తోంది. ఓ హిందీ సినిమా లైన్ ను తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయిపోవడం, ఆ చేసుకున్న వాడికి పాత ప్రేమ తెలిసి, మళ్లీ పాత ప్రేమికుడిని తీసుకువచ్చి భార్యను త్యాగం చేయడం లాంటి కథలు తెలుగు సినిమాలకు పరిచయమే.

అయితే ప్రేమించిన అమ్మాయికి పెళ్లయిపోయినా, మళ్లీ ఆమె వున్న చోటికి వెళ్లి, తన ప్రేమ గొప్పదని చెప్పి, ఆమెను భర్త నుంచి తెచ్చుకునే క్యారెక్టర్ నాని చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఇంత యాంటీ సెంటి మెంట్ కథ తీసుకున్నారా? నాని అలాంటి పాత్రను చేస్తున్నాడా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాదు నిజమే, ఇదే లైన్ అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.

నాని ఎలాంటి పాత్రను అయినా నటించి ఒప్పించి గలడు. మరి ఇదే లైన్ అన్నది వాస్తవమైతే, మరి దాన్ని లాజికల్ గా, సెంటిమెంట్ దెబ్బ తినకుండా , మాంచి ఫీల్ లవ్ సినిమాగా ఎలా మలచి వుంటారు అన్నది కాస్త ఆసక్తికరమే.