వేటగాడు మెత్తనయితే లేడి మూడు కాళ్ల మీద గెంతుతుంది. డైరక్టర్ మెత్తనయితే ప్రతి యాక్టర్ సినిమా మేకింగ్ లో ఎంటర్ అయిపోతారు. టూ కంట్రీస్ సినిమా విషయంలో అలాగే జరిగినట్లు తెలుస్తోంది.
సినిమాలో సీనియర్ నరేష్ క్యారెక్టర్ వుంది. అమెరికాలో వుండే హెన్ పెక్డ్ హస్బండ్ క్యారెక్టర్. ఈ పాత్ర అమెరికన్ యాక్సెంట్ తెలుగు మాట్లాడుతుంది. దీని వల్ల ఫన్ పుట్టకపోగా, చికాగ్గా వుంటుంది.
నిజానికి ఒరిజినల్ గా ఈ ఐడియా దర్శకుడు శంకర్ కు లేదని తెలుస్తోంది. కానీ డబ్బింగ్ టైమ్ లో, సీనియర్ నరేష్, అమెరికాలో సెటిల్ అయిన తెలుగువాళ్లు ఇలాగే మాట్లాడతారు.
దానివల్ల ఫన్ కు ప్లస్ అవుతుందని చెప్పి, తన క్రియేటివిటీ అంతా వాడేసి, డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. తీరా చేస్తే ఇప్పుడేమయింది. బి సి సెంటర్ల జనాలకు ఆ యాస, ఆ మాట చికాకుగా తయారయింది. అదే డైరక్టర్ మాట వినివుంటే ఇలా వుండదు కదా?