Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నవ్వుల గ్యాంగ్ కు లీడర్ నాని

నవ్వుల గ్యాంగ్ కు లీడర్ నాని

దర్శకుడు విక్రమ్ కే కుమార్ ది ఓ భిన్నమైన శైలి. చేసిన జోనర్ లో చేయకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. లవ్, ఫిక్షన్, ఇలా రకరకాల జోనర్ ల్లో సినిమా చేసాడు కానీ ఫుల్ టైమ్ ఎంటర్ టైన్ మెంట్ లో చేయలేదు. ఇష్క్, మనం సినిమాల్లో చాలా సున్నితమైన ఫన్ వుంటుంది. అయితే అది కొంచెమే. అందుకే ఫస్ట్ టైమ్ విక్రమ్ కే కుమార్ ఫుల్ ఫన్ టైపు సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా ఆద్యంతం వినోదంతో సాగుతుందని తెలుస్తోంది. కావడానికి చిన్న రివెంజ్ టైపు లైన్ వున్నా, సినిమా మాత్రం వినోద ప్రాధాన్యంగా వుంటుందని, నానికి సరిపడా ఫన్ క్యారెక్టర్ ను విక్రమ్ కుమార్ డిజైన్ చేసాడని బోగట్టా.

నానీస్ గ్యాంగ్ లీడర్ ఫ్రీలుక్ వదిలారు. ఫస్ట్ లుక్ 15న విడుదల చేస్తారు. టీజర్ 25న వస్తుంది. ఇప్పటికే అయిదుగురు అమ్మాయిలకు, హీరో అండగా వుండే కథ అని ఈ సినిమా గురించి సమాచారం వుంది. అందుకు తగినట్లుగానే అయిదు అమ్మాయిల చేతులు, ఓ అబ్బాయి చేయి కలిపి, కలిసికట్టుగా వున్నట్లు ప్రీలుక్ వదిలారు.

అంటే ప్రీలుక్ కథ మీద వున్న ప్రచారాన్ని పక్కా చేసినట్లు అయింది. బహుశా ఫస్ట్ లుక్ కేవలం నాని మీద మాత్రమే వుంటుందని అనుకోవాల్సిందే. లేదా గ్యాంగ్ మొత్తం లుక్ అందిస్తారో.. చూడాలి.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?