Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నయనతారకు సరిపోలేదా?

నయనతారకు సరిపోలేదా?

మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాకు స్టార్ కాస్ట్ కాస్త ఇబ్బందిగానే వుందని వార్తలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ అయిన ఈ సినిమాలో కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా, మరో మూడు పాత్రలు కీలకం. 

సిఎమ్ కొడుకు పాత్ర, కూతురు పాత్ర, ఆమె భర్త పాత్ర. ఇవీ ఆ మూడూ. వీటిలో సిఎమ్ కొడుకు పాత్రకు సల్మాన్ ఖాన్ ను ఒప్పించారని గతంలోనే వెల్లడించాం. 

ఇక కీలకమైన సిఎమ్ కూతురు పాత్రకు నయనతారను అనుకున్నారు. విలన్ పాత్ర అయిన సిఎమ్ అల్లుడి పాత్రకు సత్యదేవ్ ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ కాస్త అయోమయంలో పడినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

తన భర్తగా తన పక్కన సత్యదేవ్ సరిపోరు అని నయన్ అభ్యంతరం చెబుతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఇంకెవరినైనా చూడమని నయన్ కోరినట్లు తెలుస్తోంది. కానీ విలన్ పాత్ర కనుక అంత సులువుగా ఎవరూ దొరకరు. 

మలయాళంలో వివేక్ ఒబరాయ్ చేసిన పాత్ర ఇది. దానికి నటుడు కావాలి. నిజానికి సత్యదేవ్ బాగానే సెట్ అవుతాడు. కానీ నయన్ అభ్యంతరం చెప్పడంతో ఇప్పుడు ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?