Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

న్యూ ఇయర్ కు టీజర్..సంక్రాంతికి ట్రయిలర్

న్యూ ఇయర్ కు టీజర్..సంక్రాంతికి ట్రయిలర్

వరుణ్ తేజ-శ్రీనువైట్ల సినిమా మిస్టర్..సాయి ధరమ్ తేజ..గోపీచంద్ మలినేని సినిమా విన్నర్. ఈ రెండు సినిమాలు జోడుగుర్రాల్లా నిర్మాణంలో వున్నాయి. అయితే న్యూ ఇయర్ కు మిస్టర్  టీజర్ జనం ముందుకు వస్తోంది. 2016 ఆఖరు రోజున మధ్యాహ్నం మూడు గంటలకు మిస్టర్ టీజర్ ను శ్రీనువైట్లు విడుదలచేస్తారు. నిజానికి ఈ సినిమా విడుదలకు చాలా టైమ్ వుంది. ఏప్రిల్ లో విడుదలవుతుంది. అంతకన్నా ముందుగా సాయి ధరమ్  తేజ సినిమా విడుదలవుతుంది. అందుకే ఆ సినిమా ట్రయిలర్ ను సంక్రాంతికి వదుల్తున్నారు. సంక్రాతికి విడుదలయ్యే భారీ సినిమాల ధియేటర్లల్లో విన్నర్ ట్రయిలర్ కూడా సందడి చేస్తుందన్నమాట.  రెండు సినిమాల విడుదలకు టైమ్ చాలా వున్నా, సినిమాలు మాత్రం దాదాపు పూర్తి కావస్తున్నాయి.

ఇదిలా వుంటే శ్రీనువైట్లు మిస్టర్ ట్రయిలర్ కాస్త ఫీల్ లవ్ టైపులో డిఫరెంట్ గా వుంటుందని తెలుస్తోంది. జనాలకు అలవాటైన శ్రీను వైట్ల ఫార్ములా లో మాత్రం వుండదట. శ్రీను వైట్ల తొలి రోజులు ఆనందం, నీకోసం సినిమాలను గుర్తుకు తెచ్చేలా వుంటుందని వినికిడి. ఇటీవల మంచి టీజర్లు లేవు. ఖైదీ నెం 150  టీజర్ కు పెద్దగా అప్లాజ్ రాలేదు. కాటమరాయుడు ఫస్ట్ లుక్ ది కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం బాగున్నా మిస్టర్ టీజర్ జనాలకు నచ్చేయచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?