ఈ ఏడాదికి టాప్ హిట్‌గా 'బాహుబలి 2' సింహాసనాన్ని అందుకుంది. ఇక ఆ రికార్డుని బ్రేక్ చేసే ఆలోచన కూడా ఎవరికీ రానంత భారీ విజయాన్ని అందుకుని, ఆకాశమంత ఎత్తున నిలిచింది. 'బాహుబలి' సందడి ముగియడంతో టాలీవుడ్ మళ్లీ యథాస్థాయికి చేరుకునే బాటలో వుంది. ఇప్పట్లో మళ్లీ అలాంటి ఛాలెంజ్‌లు ఏవీ ఇతర సినిమాలకీ, హీరోలకీ ఎదురు కావు కనుక మార్కెట్ మళ్లీ మామూలు స్థాయికి వస్తోంది.
ఈ ఏడాది బాహుబలి వశం కాగా, వచ్చే ఏడాదికి మాత్రం తనే నంబర్‌వన్ అయ్యేట్టు తారక్ పక్కా ప్రణాళిక వేసుకున్నాడు. గత ఏడాదికి 'జనతా గ్యారేజ్'తో టాప్ గ్రాసర్ చేజిక్కించుకున్న ఎన్టీఆర్, 'నాన్నకు ప్రేమతో'ను మంచి విజయాన్ని చవిచూసాడు. వచ్చే ఏడాది కూడా ఎన్టీఆర్‌వి రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి. త్రివిక్రమ్‌తో చేసే చిత్రం వేసవికి, కొరటాల శివతో చేసే చిత్రం దసరాకి విడుదల కానున్నాయి.
వీళ్లిద్దరూ ఎన్టీఆర్ చిత్రానికి ఆల్రెడీ కథ లాక్ చేసేసారు. ఇద్దరూ షూటింగ్ కేవలం మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈమధ్య కాలంలో ఈ దర్శకులిద్దరి వేగం చూస్తుంటే, అనుకున్న ప్రకారం ఆ చిత్రాలు రిలీజ్ అవుతాయనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.