నీహారిక కొణిదెల నటించిన సినిమా ఒకమనసు. రామరాజు అందించిన ఈ ఫీల్ గుడ్ మూవీలో నాగశౌర్య హీరో.
ఈ సినిమాలో నటించి నీహారిక మాంచి ప్రశంసలు అందుకుంది. కానీ సినిమా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమా ఆన్ లైన్ లోకి వస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమాను నిర్మించిన మధుర శ్రీధర్ రెడ్డి సోనీ లివ్ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ సౌత్ ఇండియా కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు. సౌత్ సినిమాలను ఇకపై సోనీ లివ్ లో కూడా చూడొచ్చన్నమాట.
దక్షిణాది మార్కెట్ మీద సోనీ దృష్టి పెట్టింది.కంటెంట్ కావాలి. ఇప్పుడు మదుర శ్రీధర్ బాధ్యత అదే.అందులోభాగంగా ఒక మనసు సినిమా సోనీ లివ్ లోకి వస్తుందని తెలుస్తోంది.