నీహారికతో జోడీకి నో చెప్పిన హీరో

నీహారిక రెండో సినిమా సన్నాహాలు సాగుతున్నాయి.ఒకమనసు పెయిల్యూర్ తరువాత సరైన స్క్రిప్ట్ కోసం తెగ గాలిస్తున్నారు. ఇందుకోసం ఆమె, ఆమె తండ్రి నాగబాబు సీరియస్ గా స్క్రిప్ట్ లు వింటున్నారు. ఇటీవల ఓ స్క్రిప్ట్…

నీహారిక రెండో సినిమా సన్నాహాలు సాగుతున్నాయి.ఒకమనసు పెయిల్యూర్ తరువాత సరైన స్క్రిప్ట్ కోసం తెగ గాలిస్తున్నారు. ఇందుకోసం ఆమె, ఆమె తండ్రి నాగబాబు సీరియస్ గా స్క్రిప్ట్ లు వింటున్నారు. ఇటీవల ఓ స్క్రిప్ట్ ఓకె చేసారట. దానికి ఓ యంగ్ హీరో అయితే బాగుంటాడని, ఆ స్క్రిప్ట్ ను అతని దగ్గరకు పంపారట. అయితే ఆ స్క్రిప్ట్ సదరు యంగ్ హీరోకి నచ్చలేదట. 

నాగబాబుకు అదే చెప్పి, తాను నీహారికతో చేయడానికి రెడీ అని, కానీ మంచి స్క్రిప్ట్ అయితేనే చేయగలనని, ఈ స్క్రిప్ట్ వర్కవుట్ అవ్వదని వివరించాడట. ఆ హీరో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. మరో సినిమా ఇటీవలే కమిట్ అయ్యాడు. మరి ఆ హీరో నో చెప్పిన స్క్రిప్ట్ నే నీహారిక మరో హీరోతో చేస్తుందో? లేదా బాగాలేదన్న అభిప్రాయాన్ని సీరియస్ గా తీసుకుని మరో స్క్రిప్ట్ కోసం ప్రయత్నిస్తుందో చూడాలి మరి.