Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిజమేనా? హరీష్ ఇదంతా?

నిజమేనా? హరీష్ ఇదంతా?

డైరక్టర్ హరీష్ శంకర్ ది ఓ డిఫరెంట్ స్టయిల్. షూటింగ్ టైమ్ లో వివాదాలకు కేంద్రం అవుతుంటారు ఆయన. లేటెస్ట్ గా హరీష్ శంకర్ 14 రీల్స్ పతాకంపై వాల్మీకి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా సమయంలో కూడా వివాదాలు తప్పడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా రాయలసీమకు వెళ్లినపుడు వాల్మీకి సామాజిక వర్గంతో వివాదం వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయింది.

ఆ సంగతి అలావుంటే ఈ మధ్య షూటింగ్ టైమ్ లో ప్రొడక్షన్ యూనిట్ జనాలతో కూడా వాదనో? ఘర్షణో తలెత్తినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కాస్త ఎక్కువ రాద్దాంతానికే దారి తీసిందని, ఆ తరువాత సర్దుబాటు జరిగిందని వినిపిస్తోంది.

ఇదిలావుంటే ఓ విషయంలో హీరోకు అభిప్రాయానికి మద్దతుగా నిలిచారని, తనవైపు వుండలేదని అలిగి, హరీష్ శంకర్ తన పీఆర్ టీమ్ జనాలను ట్విట్టర్ లో అన్ ఫాలో చేసినట్లు వినిపిస్తోంది. ట్విట్టర్ లో అన్ ఫాలో చేసిన మాట వాస్తవమే అని తెలుస్తోంది. అయితే మళ్లీ ఆయనే మనసు మార్చుకుని, మామూలు అవుతారని, హరీష్ కు ఇలా చిన్న పిల్లాడిలా అలగడం కామన్ అని ఇండస్ట్రీ జనాల్లో వినిపిస్తోంది.

మొత్తంమీద హరీష్ శంకర్ ఒక పక్క వివాదాల గ్యాసిప్ లకు కేంద్రం అవుతూనే, సెప్టెంబర్ 13 విడుదలకు వాల్మీకిని రెడీ చేస్తున్నారు.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?