ఏదో ఓక కాన్సెప్ట్ లేకుంటే సినిమాకు రావడం లేదు జనాలు. అందుకే ఇటు హీరోలు, అటు దర్శకులు కూడా కాన్సెప్ట్ ల కోసం వెదుకులాడుతున్నారు. స్వామిరారా, కార్తికేయ లాంటి విభిన్నమైన సినిమాలు చేసిన నిఖిల్ ఇప్పుడు సూర్య వెర్సస్ సూర్య చేస్తున్నాడు.
కార్తికేయ చిత్రంతో కెమెరామెన్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ సినిమా డైరక్ట్ చేసిన చందు మాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సర్యుడిని చూడడం కానీ, ఎండలోకి రావడం కానీ చేయలేని ఓ యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందన్నది పాయింట్ అని తెలుస్తోంది.
ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు బయటకు రాకూడని ఆరోగ్య సమస్య. మరి ప్రేమ ఎక్సెట్రా వ్యవహారాలెట్లా..అదే సూర్య వెర్సస్ సూర్య సినిమా అంట. ఇదేదో భలేగా వుండేలాగే వుంది.