నిక్కరు వేసుకొచ్చి కథ చెప్పాడు

దర్శకుడు సుజిత్ తనకు సాహో సినిమా కథ చెప్పినపుడు నిక్కరు వేసుకుని వచ్చిన 22 ఏళ్ల కుర్రాడు అని హీరో ప్రభాస్ అన్నారు. Advertisement సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ అంత…

దర్శకుడు సుజిత్ తనకు సాహో సినిమా కథ చెప్పినపుడు నిక్కరు వేసుకుని వచ్చిన 22 ఏళ్ల కుర్రాడు అని హీరో ప్రభాస్ అన్నారు.

సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ అంత చిన్న కుర్రాడు హేమా హేమీ టెక్నీషియన్లతో పని చేయించుకున్న తీరు, పని రాబట్టుకున్న తీరు సూపర్ అని, కచ్చితంగా పెద్ద డైరక్టర్ అయిపోతాడని, ఇంటర్నేషనల్ డైరక్టర్ అయిపోతాడని ప్రభాస్ అన్నారు. 

ఎప్పుడూ మాట ఇస్తూ చేయలేకపోతున్నానని, కానీ ఈసారి మాట ఇవ్వకుండానే ఏడాదికి రెండు సినిమాలు చేయాలని అనుకుంటున్నాని ప్రభాస్ అన్నారు.

జాగ్రత్తగా సినిమా చేసి వుంటే వంద కోట్ల ప్రాఫిట్ వచ్చేదని, కానీ వంశీ, విక్కీ, ప్రమోద్ అలాంటిది ఏమీ పట్టించుకోకుండా, తన కోసం డబ్బులు, లాభం అన్నది చూసుకోకుండా సినిమా చేసారని, అలాంటి స్నేహితులు అందరికీ వుండాలని ప్రభాస్ అన్నారు. 

శ్రద్ద కపూర్ లాంటి హీరోయిన్లు అరుదుగా వుంటారని, రెండేళ్ల పాటు ఈ సినిమా మీద పనిచేసినా ఒక్క రోజు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలా లేదని, అంత కోపరేటివ్ గా వుండడం చాలా అరుదు అని, ఫైట్లు కూడా బాగా చేసిందని ప్రభాస్ అన్నారు.