నాని నటించిన నిన్నుకోరి సినిమా మార్నింగ్ షో అయిపోతూనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా బి సెంటర్ల ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని టాక్ ఏకగ్రీవంగా వచ్సేసింది. నాని మిస్టర్ డిఫెండబుల్ అని మీడియా గొప్పగా చెప్పింది. అయితే అంతా బాగానే వుంది. సినిమా విడుదలై 10రోజులు అయ్యింది. ఈ వారం పెద్దగా గొప్ప సినిమాలు వచ్చి పోటీ ఇవ్వకపోయినా, శమంతకమణి మాత్రం ఫరవాలేదు అనిపించుకుంది. కలెక్షన్లు ఓ మాదిరిగా వున్నాయి.
నిన్నుకోరి సినిమా తొలి మూడు రోజులు ఓ ఊపు ఊపిన మాట వాస్తవం. కానీ ఆ తరువాత నెమ్మదించిన మాట అంతకన్నా వాస్తవం. పదిరోజుల కలెక్షన్లు అమ్మిన రేట్లు చూస్తే బయ్యర్లు జస్ట్ గట్టెక్కేటట్లే కనిపిస్తున్నారు. మహా అయితే సెంకెండ్ వీక్ క్లోజ్ అయ్యేసరికి పది శాతం ఖర్చలు కిట్టుబాటు అయ్యేటట్లు కనిపిస్తోంది.
దీనికి కారణం వాతావరణం అంత అనుకూలంగా లేకపోవడం, సినిమా ముందు అనుకున్నంతగా బి సెంటర్లలో నడవకపోవడం, సి సెంటర్ల ప్రేక్షకులకు పట్టకపోవడం అన్న టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఫిగర్లలో చూస్తే ఇలా వుంది. బ్రాకెట్లలో వున్నవి అమ్మిన రేట్లు. విశాఖ 1.70కి అమ్మారని అంటున్నారు. కానీ వాస్తవానికి 2.50 కు అమ్మారని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
నైజాం.. 8.25 (5.50)
వైజాగ్…2.80 (2.50)
సీడెడ్…..2.42(2.30)
ఈస్ట్…….1.60(1.20)
వెస్ట్…..1.07 (0.95)
కృష్ణా….1.37 (1.20)
గుంటూరు…..1.33 (1.40)
నెల్లూరు…..0.56 (0.65)
ఓవర్ సీస్ …..3.80 (3.50)
ఈ లెక్కన చూసుకుంటే ఒక్క నైజాం మాత్రమే పది రోజుల్లో లాభాల బాట పట్టింది. మిగిలినవన్నీ ఖర్చులు గిట్టుబాటు చేసుకోవడంలోనే వున్నాయి ఇంకా. ఏమి వచ్చినా ఇక ఈ మూడు రోజుల్లోనే రావాలి. 21 నుంచి మళ్లీ సినిమాల తాకిడి బాగానే వుంది. పైగా ఆంధ్ర అంతా తుపాను వాతావరణం అలుముకుంది. దాంతో కలెక్షన్లు అంత గొప్పగా వుండడం లేదు ఏ సినిమాకు కూడా.