ఆర్ఆర్ఆర్ లాంటి అత్యంత భారీ సినిమాను తలెకెత్తుకున్నారు నిర్మాత దానయ్య. అడ్వాన్స్ లు ఏమేరకు వచ్చాయన్నది పక్కన పెడితే, ఎవరెవరికి ఏ ఏరియా అన్నది కూడా ఫిక్స్ చేసుకున్నారు. సినిమా షూట్ సజావుగా జరుగుతోంది అనుకుంటే కరోనా వచ్చి పడింది.
అసలు కరోనా రాకముందే రెండు డేట్ లు మారి 2021 సంక్రాంతికి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 2021 సంక్రాంతి సరే, కనీసం సమ్మర్ కేనా రెడీ అవుతుందా? అన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. ఇద్దరు హీరొలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పట్లో షూటింగ్ కు వచ్చే ఆలోచనలో లేరని గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా వల్ల వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ సంగతి అలా వుంచితే, మూడేళ్ల విలువైన కాలం వృధా అయిపోయింది. దాంతో ఇద్దరు హీరోలు కరోనా టైమ్ లో సైలంట్ అయిపోయారు. ఆలియా భట్ ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దానయ్యకు డైరక్టర్ రాజమౌళి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఏమీ టెన్షన్ పడవద్దని, అంతా సర్దుకుంటుందని, అన్నీ అనుకూలంగానే వుంటాయని ఆయన చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిర్మాత దానయ్య ఈ మధ్యనే హార్ట్ కు స్టెంట్ వేయించుకున్నారు. అందువల్ల అస్సలు ఏమీ పట్టించుకోవద్దు, అన్నీ సర్దుకుంటాయని, తాను చూసుకుంటా అని రాజమౌళి భరోసాగా చెప్పినట్లు తెలుస్తోంది.