నిర్మాతలు ఆనందంగా వుండాలంటే ఏం కావాలి. సింపుల్. సినిమా హిట్ కావాలి. దండిగా డబ్బులు రావాలి. అంతే. అందుకే ఆనందో బ్రహ్మ నిర్మాతలు ఇప్పడు పిచ్చ హ్యాపీ. ఈ నిర్మాతలు తీసిన తొలిసినిమా భలేమంచి రోజు మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది కానీ, కాసుల పెద్దగా కురిపించలేదు. ఫరవాలేదు అనిపించుకుంది.
తీసిన రెండో సినిమా ఆనందో బ్రహ్మ మాత్రం రెండు సినిమాలకు సరిపడా ఆనందం ఇచ్చేసింది. సినిమాను ఎక్కువగా అమ్మలేదు. దాదాపు మూడు వంతుల ఏరియాలను స్వంతగా విడుదల చేసుకున్నారు. సినిమాకు జస్ట్ మూడు కోట్లకు కాస్త అటు ఇటుగా ఖర్చయింది.
ఇప్పుడు అదంతా జస్ట్ శాటిలైట్ రూపంలో వచ్చేసింది. జీ టీవీ మూడు కోట్ల రేంజ్ లో ఆనందో బ్రహ్మ శాటిలైట్ హక్కులు తీసుకుంది. అంటే పెట్టుబడి రికవరీ అయిపోయింది. థియేటర్ రైట్స్ అమ్మిన ఏరియాల నుంచి దగ్గర దగ్గర రెండుకోట్ల వరకు వచ్చిందని అంచనా.
డొమెస్టిక్ మార్కెట్ లో కలెక్షన్లు వన్ వీక్ దాటినా ఫరవాలేదు అనే రేంజ్ లోనే వున్నాయి. అవి కూడా మూడు కోట్లకు పైగానే వుంటుందని తెలుస్తోంది. అంటే టోటల్ గా అయిదు కోట్ల వరకు లాభం వుండే అవకాశం వుంది. మరి టైటిల్ కు జస్టిఫికేషన జరిగినట్లేనా? సినిమాకు దర్శకత్వం వహించిన మహీ కూడా హ్యాపీనే. ఎందుకంటే ఆఫర్లు, ఎంక్వయిరీలు బాగానే వున్నాయి కనుక.