ఈనెల 31న విడుదల కావాల్సి వుంది అనుష్క నిశ్శబ్ధం సినిమా. కోన వెంకట్ తో కలిసి పీపుల్స్ మీడియా చేసిన వెంచర్ ఇది. మాధవన్ హీరో. ఇప్పటికే విడుదల చేసిన సినిమా మెటీరియల్ అంతా ఆదరణకు నోచుకుంది. సినిమా మీద కాస్త ఆసక్తి ఏర్పడింది.
కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమా విడుదల వాయిదా పడుతోందని. అనుకున్నప్రకారం 31 న రావడం లేదని. టెక్నికల్ రీజన్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే సినిమా ఎప్పుడో మొదలుపెట్టారు. ఫినిష్ చేసారు. సినిమా వర్క్ అంతా పూర్తయినట్లే. సినిమా దర్శకుడు కూడా తరువాత సినిమా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు బోగట్టా.
మరి ఇలాంటి నేపథ్యంలో వాయిదా అంటే, బహుశా సీజన్ కో, పోటీగా వస్తున్న సినిమాల తాకిడి చూసో అయి వుండాలి. అదే రోజు మరో రెండు మీడియం సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ ముందువారం డిస్కోరాజా వుంది. అదీ కాక పండగ సినిమాలు ఫుల్ గా జనాల డబ్బులు దులిపేసాయి. అందువల్ల నిశ్శబ్దం నిర్మాతలు ముందు జాగ్రత్తగా వెనక్కు వెళ్తారని వినిపిస్తోంది.